నీదీ నాదీ ఒకే కథ

మనసు మరీ మారాం చేస్తుంది ఎందుకో ఇలా?? రోజు రోజుకీ మారిపోతుంది చంటి పాపలా ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తాయి సరిగ్గా పడుకునే వేళకి లాలించి బుజ్జగించి నిద్రపోయేలోపు మారిపోతోంది తేదీ నచ్చిన పనికి డబ్బులు రాక డబ్బులొచ్చే పని నచ్చక మునుపటిలా దేన్నీ ఆస్వాదించలేకపోతున్నా ఉన్న ఈ ఒక్క ఉద్యోగం వదులుకోలేక ఆశ పడ్డది అందుకోలేక ఇలా సగం సగం బ్రతుకుతున్న అనుకున్నంత తేలిక కాదు తలరాతను ఎదుర్కోవడం నచ్చినా నచ్చకపోయినా లాగక తప్పదు బ్రతుకనే ఈ రథం ఏదైనా సాధిస్తేగానీ గుర్తించరు నువ్వు పడ్డ బాధలు గృహప్రవేశానికి కానుకలు తెచ్చేవారందరూ ఇల్లు కట్టేటప్పుడు ఇటుకైనా ఇవ్వరు కాస్త అటు ఇటుగా నీది నాదీ ఒకే కథ మధ్యతరగతి యువతీ యువకుల మనోవేదనకి ప్రతీక ప్రత్యేకించి ముదిరి ముప్పై దాటిన వారందరికీ అంకితం ఈ కవిత ఇలా ఎన్ని చెప్పినా తెల్లవారితే అంతా మామూలే మన జీవితాలలో నిత్యం ఉండే గోలే Please check out my youtube channel: www.youtube.com/c/NS360

2356 232

Suggested Podcasts

The Washington Post

JAMA Network

UNspoiled! Network

Dysfunctional as F*ck

thefunctionaltimes

Geek Therapy Network

Omprakash

Eli Jakson