బోడ మల్లన్న
ముత్యమంత నవ్వుకే మురిసిపోతావు కాస్త చనువిస్తే కరిగిపోతావు మాట కలిపిన వారంతా మన వాళ్ళు అనుకుంటావు తెలివిలేని నరుడా నిన్ను తేలికగా వాడుకుంటారు ఏరు దాటించిన తరువాత బోడమల్లన్నవు నువ్వు నువ్వు అనుకున్నది జరగనినాడు ఆశపడింది దక్కని నాడు నా అనుకున్న వారు నీతో ప్రవర్తించే తీరు గమనిస్తే చాలు అంతకు మించి అవసరం లేదు నీకు ఏ వ్యక్తిత్వ వికాస పాఠాలు నీ గమ్యానికి చేరనివ్వకుండా అడ్డుపడేది ఏదైనా నీకు శత్రువే అది భయమైనా అనుమానమైనా ప్రేమైనా వ్యామోహమైనా వృథాగా పోదు నీ ఏ ప్రయత్నం ఓడిపోతే నీకు గుణపాఠం గెలిస్తే భావితరాలకు పాఠం ఫలితం గురించి ఆలోచిస్తూ చేయకు కాలక్షేపం నా అంతట నేను తాకి తెలుసుకుంటాను లోతెంత ఉందో దూకి చూస్తాను ఎవరెన్ని చెప్పినా నేను వినను అని భీష్మించుకుంటే కాలేది నీ ఒళ్లే విరిగేది నీ కాళ్లే నీకంటే ముందుగా అనుభవించిన వాళ్లుచెప్పిన సలహాలు తీసుకుంటే మంచిదే కదా ఏదో ఒక దశలో బోడమల్లన్నలే అందరూ ఇక్కడ Please check out my youtube channel: www.youtube.com/c/NS360