విజాతి ధృవాలు
మన అభిరుచులు వేరుఅభిప్రాయాలు కలవలేదుఇద్దరి నమ్మకాలకు అసలు పొంతనే లేదుమన మధ్య జరిగిన గొడవలకు లెక్కే లేదుఅయినా మనం విడిపోలేదువిజాతి ధృవాలను కలిపి ఉంచేఅయస్కాంత క్షేత్రంలాపనిచేస్తుందేమో మన మధ్య ఏదో బలంఏ జన్మలో ముడిపడిన బంధమోఈ జన్మలో అయ్యాం ప్రేమికులంఅనుకోకుండా కలిసాం మనంచూస్తుండగానే ఒక్కటై పోయాంకలలా ఉంది ఇన్నాళ్లు గడిపిన కాలంతొలిసారి నిన్ను చూసిన క్షణంనా మదిలో పదిలం కలకాలంమన చేతికున్న వేళ్లే ఒకలా లేవుఅలాంటిది మనం కోరుకున్న వాళ్లుమనం కోరినట్టు లేరుఅనుకోవటంలో అర్థం లేదువిరుద్ధ స్వభావాలు మనవైనాఎలాంటి సారూప్యత లేకున్నానీకోసం నేను నాకోసం నువ్వుమనసు చంపుకొని మారిపోవటం కాదు ప్రేమంటేమనలా మనముంటూఒకరినొకరు అర్థం చేసుకుంటూకలిసి నడవడమే మనకి కావాల్సిందిఇదే నవతరం ప్రేమకి నాందిPlease check out my YouTube channel:www.youtube.com/c/NS360