నాతో నేను
నాతో నేను నిజాయితీగా ఉంటే చాలుఅక్కర్లేదు నాకే మంచి పేరునచ్చింది చేస్తూ ఇలా బ్రతికేస్తే చాలునన్ను నేను కోల్పోయి కోరుకోను ఏ సన్మానాలునా కలల ప్రపంచంలో విహరించే స్వేచ్ఛ ఉంటే చాలుఅక్కర్లేదు నాకే కీర్తి కిరీటాలుఒక మూసలో బ్రతికేయడం నా వల్ల కాదుఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు ఈ జనాలుమాటకు విలువనిచ్చే మనిషిని నేనుకాకిలాగా రోజంతా వాగలేనుఏరి కోరి ఎవ్వరి మనసు నొప్పించలేనునా పెదవి దాటిన మాటకు నేను బానిసనుబాధలో కూడా చెరిగిపోనివ్వనునా మోముపై చిరునవ్వునుపిల్లగాలికి వంగిపోయే గడ్డిపోచను కానుపెనుతుఫానుకైనా చెదరని మర్రి మానుని నేనునా అంతట నేను ఎవ్వరి దగ్గరా చనువును కోరనుఓదార్పు కోసం ఇంకొకరి సాయం ఆశించనునాతో నేను ఎంతసేపైనా ఉండగలనుకాలక్షేపం కోసం ఒకరి విలువైన సమయాన్ని వృథా చేయనుPlease check out my YouTube channel:www.youtube.com/c/NS360