ధూళి రేణువులు
మాట మీద నిలబడలేని వాడు మనిషికాదంటారుమంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనుకున్ననాడుమనసు మార్చుకోవడంలో తప్పులేదుమాట మీద నిలబడి మూటకట్టుకొని పోయేదేమీ లేదుఇక్కడ ఎవరూ దేవుళ్లు కారురేపేం జరుగుతుందో ఊహించలేరుపరిస్థితులకు తగ్గట్టు మారే తీరుతప్పంటే ఎలా మాష్టారు??మంచైనా చెడైనా మొఖం మీదే చెప్పాలంటారుసరే అని ఉన్నదున్నట్టు మాట్లాడితేదున్నపోతులా మీద పడిపోతారుమనుషులు కదా మాటంటే పడలేరుమంచి అనిపించుకోవాలని ఒకడి వెంట వెళ్లటం కన్నావీలు లేదని అని ఊరుకోవడమే మేలునీ పనులు పక్కన పెట్టి నిన్ను తీసుకెళ్లే స్నేహితులునీకు అవసరమున్న నాడు ఒక్కడు కూడా రాడుమొహమాటానికి పోతే ఏదో అయ్యిందని ఊరికే అనలేదు పెద్దలుఇక్కడ నిజాలు మాట్లాడే వారికి అవార్డులేం ఇవ్వరుమంచి చేసే వారిని తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చెయ్యరుఈ అనంత విశ్వంలో ధూళిరేణువులే అందరూఎవరి కలల ప్రపంచానికి వారే రాజులుఎవరికి వారే ఈదుతున్న భవసాగరాలుతీరం చేరే దారి కోసం వెతికే వారే ప్రతీ ఒక్కరుకాళ్లు చేతులు ఆడించకుంటే మునిగిపోతారునువ్వు అలిసిపోతే నిన్ను వదిలేసి పోతారుPlease check out my YouTube channel:www.youtube.com/c/NS360