Sathaka Madhurima 2 | శతక మధురిమ 2 | 10th Class Telugu | Season 4 | Episode 37 | Srini's EDU Podcast
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima ("Neeramu Tapthalohamuna") In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Enugu Lakshmana Kavi "Neeramu Tapthalohamuna" నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా నీరమె శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ బౌరుష వృత్తులి ట్లదము మధ్యము నుత్తము గొల్చువారికిన్. ఏనుగు లక్ష్మణకవి. పదవిభాగం: నీరము, తప్తలోహమున, నిల్చి, అనామకమై, నశించున్, ఆ నీరము, ముత్యము + అట్లు, నళినీదళ, సంస్థితము + ఐ, తనర్చున్, ఆ నీరమె, శుక్తిలోన్ + పడి, మణిత్వము, కాంచున్, సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులు, ఇట్లు, అధమున్, మధ్యమున్, ఉత్తమున్, కొల్చువారికిన్. ప్రతిపదార్ధము: నీరము = నీరు తప్తలోహమున = బాగా కాలిన ఇనుము నందు నిల్చి = పడి (నిలబడి) అనామకమై = ఆవిరైపోయి నశించున్ = నశిస్తుంది ఆ నీరము = ఆ నీరే నళినీదళ = తామరాకు మీద సంస్థితము + ఐ = కదలకుండా ఉన్నప్పుడు ముత్యము + అట్లు = ముత్యము వలే తనర్చున్ = ప్రకాశిస్తుంది ఆ నీరమె = ఆ నీరే శుక్తిలోన్ + పడి = ముత్యపుచిప్పలో పడితే సమంచిత ప్రభన్ = చక్కని కాంతితో మణిత్వము = మణి రూపమును కాంచున్ = పొందుతుంది అధమున్ = నీచుడుని మధ్యమున్ = మధ్యముడుని ఉత్తమున్ = ఉత్తముడుని కొల్చువారికిన్ = సేవించేవారికి పౌరుష వృత్తులు = మనుషుల యొక్క ప్రవర్తన కూడా ఇట్లు (ఉండున్) = ఈ విధంగా ఉంటాయి భావం: నీరు బాగా కాలిన ఇనుము నందు పడి ఆవిరైపోయి నశిస్తుంది. ఆ నీరే తామరాకు మీద కదలకుండా ఉన్నప్పుడు ముత్యము వలే ప్రకాశిస్తుంది. ఆ నీరే ముత్యపుచిప్పలో పడితే చక్కని కాంతితో మణి రూపమును పొందుతుంది. అలాగే మనిషి అధములను చేరితే అధముడౌతాడు. మధ్యములను చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములను చేరితే ఉత్తముడౌతాడు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message