Sathaka Madhurima 1 | శతక మధురిమ 1 | 10th Class Telugu | Season 4 | Episode 36 | Srini's EDU Podcast

Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Enugu Lakshmana Kavi "Karirajun Bisathanthu" కరిరాజున్ బిసతంతు సంతతులచేగట్టన్ విజృంభించు వా డురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపదీ పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబు జిందు యత్నించు ని ద్ధరణిన్ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్ - ఏనుగు లక్ష్మణకవి పదవిభాగం: కరిరాజున్, బిసతంతు, సంతతులచేన్, కట్టన్, విజృంభించున్, వాడు, ఉరు వజ్రంబు, శిరీష పుష్పములచేన్, ఊహించు, భేదింపన్, తీపురచింపన్, లవణ + అబ్దికిన్, మధుకణంబునఁ, చిందు, యత్నించున్, ఇద్దరిణిన్, మూర్ఖులన్, తెల్పును, ఎవ్వడు, సుధాధారా, అనుకార + ఉక్తులన్. ఉద్దేశం: మూర్ఖుని మనసుని మెప్పించలేము Purpose: The mind of a fool cannot be persuaded ప్రతిపదార్ధము: ఇద్దరణిన్= ఈ భూమి పై ఎవ్వడు= ఎవ్వడైతే సుధాధార= అమృత ధారలను అనుకార+ ఉక్తులన్ = పోలినట్టి మాటలతో మూర్ఖులన్= మూర్ఖులను తెల్పున్= సమాధాన పరుచునో వాడు= అతడు కరిరాజున్= గజరాజును (ఏనుగును) బిసతంతు= తామరపువ్వు కాండము సంతతులచేన్= సమూహముచే కట్టన్= బంధించుటకు విజృంభించున్= ప్రయత్నిస్తాడు ఉరు వజ్రంబు = గొప్ప వజ్రంను శిరీష పుష్పములచేన్ = విరిసిన పువ్వులచే భేదింపన్= కోయటానికి ఊహించున్= ఆలోచిస్తాడు లవణ+ అబ్దికిన్ = ఉప్పు సముద్రానికి తీపు రచింపన్ = తీయ్యదనమును కలిగించుటకు మధుకణంబున్= తేనెబొట్టును చిందు= చిందించడానికి యత్నించున్= ప్రయత్నిస్తాడు భావం: తామరపూవు కాండములతో మదపుటేనుగును బందించాలని ఆలోచించే వాడు, విరిసేపువ్వుకొనతో వజ్రమును కోయటుకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రము నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడితోనూ, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానులవుతారు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Jennifer a Michael Gallagher

Canoe West Media

CaskStrength Media

Food a Wine Pro

Koda CrossFit Iron View

Dear Media, Alexis Haines

Ben Lewis and Mike McIntyre /Tennis Channel Podcast Network

Brooklyn Zen Center

Kenneth Vigue